11న ప్రేక్షకుల ముందుకు 'అనగనగా ఒక చిత్రవ్‌ు'
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ హీరోయిన్గా జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన ప్రేమకథాచిత్రవ్ు` దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న పూర్తి హాస్యరస ప్రేమకథా విచిత్రవ్ు అనగనగా ఒక చిత్రవ్‌ు`. డిసెంబర్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల ప్రదర్శన శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.
సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య సంగీత దర్శకత్వంలో స్వరపరచగా, మిట్టపల్లి సురేందర్ రచించిన ముంచింది ముత్యాల కడవ దాని ముంగిట సింగులు తడువ గీతాన్ని సింహ గానం చెయ్యగా రఘు నృత్య దర్శకత్వం లో హీరో శివ మేఘశ్రీ, డాన్సర్లలపై నాగారం గ్రామములో నూతనంగా నిర్మించబడిన పద్మాలయ స్టూడియోలో రూపొందించిన భారి సెట్ లో చిత్రీకరించారు.
యూరప్‌లోని జార్జియా దేశ రాజధాని టిబ్లిసి, అనానురి, స్నో మరియు కాస్బెర్గ్ తదితర ప్రకృతి అందాలు కలబోసిన పచ్చని ప్రాంతాలలో రఘు నృత్య దర్శకత్వంలో, సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య స్వర పరచిన గీతాలలో అడగర్ల కరుణాకర్ రచించగా.. సింహా, ఉమా నేహా గానం చేసిన.. లంగా ఓణీ పిల్లా.. నీ లంగరేసెయ్ ఇల్లా.. నీ సెంగుచాటు సింగారాలు ఇస్తావా మల్లా`ను మాస్ ప్రేక్షకులను అలరించే పాటగా హీరో, హీరోయిన్, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించారు. మిట్టపల్లి సురేందర్ రచించగా.. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గానం చేసిన నిన్ను చూడందే హృదయం నిలవదు ఏ చోటా.. చిట్టి చిట్టి నీ మదిని చుట్టిముట్టి యదనే యదతో తెచ్చుకుంటా ముడిపెట్టి` పాటను హీరోహీరోయిన్లపై మాంటేజ్ సాంగ్ చిత్రీకరించారు. గోసాల రాంబాబు రచించగా రేవంత్, మాళవిక గానం చేసిన కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడవెందుకే.. ఓ సజనా.. సజనా.., ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే` యుగళ గీతాన్ని హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించారు.
పాటల ప్రదర్శన అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత జె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా ఇంత అందంగా రావడానికి యూనిట్ అందరూ బాగా సహకరించారు. బాహుబలి` చిత్ర రచయిత అజయ్ కథ, మాటలు మా చిత్రాన్ని మరింత బలాన్ని చేకూర్చాయి. వినోద్ యాజమాన్య సంగీతం యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హీరో శివకు ఈ సినిమా మంచి టర్నింగ్‌పాయింట్ అవుతుంది. ఒక కమర్షియల్ చిత్రానికి కావాల్సిన అన్ని రకాల హంగులూ ఈ చిత్రానికి చక్కగా కుదిరాయి. కామెడీతో కూడిన థ్రిల్లర్ మూవీ. ఇండస్ట్రీలోని టాప్ కమెడియెన్స్, ఆర్టిస్ట్‌లు ఉన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ.. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఖర్చుకు వెనకాడకుండా విదేశాల్లో అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించాం అన్నారు
పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే ఇది మా శివ కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని గట్టి నమ్మకం కలిగింది. ప్రేమకథా చిత్రవ్‌ు తరహాలో దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని కూడా వినోదాత్మక చిత్రంగా అందరినీ అలరించేలా రూపొందించారు అన్నారు.
నటీనటులు
శివ, మేఘశ్రీ, జయప్రకాష్‌రెడ్డి, షియాజిషిండే, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, సూర్య, గిరిబాబు, రఘుబాబు, పృథ్వీ, అనంత్, జోగి బ్రదర్స్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, అల్లరి సుభాషిని, కృష్ణ వేణి (భాహుబలి ఫేం), బ్యాంకు విజయ్, వాజ్పాయ్, కోటేశ్వరరావు, గగన్, డి.వి. మధు.
సాంకేతిక వర్గం
కథ, మాటలు: అజయ్, ఫోటోగ్రఫీ: వి. రవికుమార్, సంగీతం: వినోద్ యాజమాన్య, ఎడిటింగ్: టి. సాయి బాబు, ఆర్ట్: విజయ్‌కృష్ణ, మేకప్: రంగా, కాస్టుమ్స్: కె. మురళి, స్టిల్స్: బాలు, పి.ఆర్.ఓ: బాలాజీశర్మ, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్ యమ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలి శ్రీనివాసరావు, ప్రొడక్షన్ మేనేజర్: ఆర్. రాంబాబు, అసిస్టెంట్ డైరక్టర్స్: సుదర్శన్, హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్: ఉమేష్ నాగ డి.యమ్. మంజునాథ్ సజ్జన్, కో డైరెక్టర్: ఎస్. నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: కొడాలి సుబ్బారావు, జె. ప్రభాకరరెడ్డి, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె. ప్రభాకరరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com