దాసరి చేతుల మీదుగా 'అనగనగా ఒక చిత్రమ్' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకథా చిత్రవ్‌ు` దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై శివ, మేఘశ్రీ జంటగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక చిత్రమ్` ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి, వినోద్ యాజమాన్య సంగీతం అందించిన సీడీలను ఆవిష్కరించి తొలికాపీని తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందించారు.
మొదటి పాటను జి. ఆదిశేషగిరిరావు ఆవిష్కరించగా.. రెండవ పాటను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ, విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, హీరో ప్రిన్స్‌లు, మూడవ పాటను నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్‌లు, టి.సి.ఎస్ సాఫ్ట్‌వేర్ శ్రీనివాస చక్రవర్తిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాయని ఉమానేహా, సింహా గానం చేసిన లంగా ఓణీ పాటను స్టేజ్‌పై పాడి వినిపించారు.
వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి సారధ్యం వహిస్తున్న ఆరుష్ మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ప్రముఖ ఆడియో సంస్థ లహరి ద్వారా పాటల సీడీలను విడుదల చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, పద్మాలయ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాతలు కొడాలి సుబ్బారావు, మా పద్మాలయా మల్లయ్య, ప్రభాకర్‌రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని, మా శివ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ప్రభాకర్‌రెడ్డి నాకు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పటి నుంచీ తెలుసు. మంచి టెక్నీషియన్. ఈ సినిమాతో దర్శకుడిగా తన సత్తా నిరూపించు కుంటాడని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ సందర్భంగా.. దర్శకరత్న మాట్లాడుతూ.. సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఆడియో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అందుకే చాలా రోజుల నుండి నేను ఆడియో ఫంక్షన్స్‌కు రావడం మానేసాను. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి రావడానికి కారణం మా పద్మాలయా మల్లయ్య. ఈ చిత్రాన్ని ప్రారంభించిన మొదటిరోజే ఆడియో ఫంక్షన్‌కు రావాలని అడిగారు. ప్రేమకథా చిత్రవ్‌ు`వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రభాకర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం పాటు నిర్మాతగా కూడా మారడం సంతోషం. ఫుల్ కామెడీతో ఈ చిత్రం నడుస్తుందని మల్లయ్య చెప్పాడు. ఈ పాటలను నేను విన్నాను. 5 పాటలలో నాకు 3 పాటలు బాగా నచ్చాయి. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో బాహుబలి`, శ్రీమంతుడు` పెద్ద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమా చూపిస్త మావ` కూడా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇదొక శుభ పరిణామం. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తున్నంతసేపు శివ బాగా నటించాడనిపించింది. వినోద్ అందించిన మ్యూజిక్ బావుంది. బాహుబలి`, శ్రీమంతుడు` అన్ని బాషలలో విడుదలయ్యి తెలుగు సినిమా స్టామినా చూపించాయి. కొత్త సినిమాలు, కొత్త కథానాయకులు రావాలి. ఈ చిత్రం టీమ్ అందరికి నా ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
థియేటర్ ట్రైలర్ విడుదల చేసిన అనంతరం హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. నాకు ప్రేమకథా చిత్రవ్‌ు`తో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు ప్రభాకర్‌రెడ్డిగారు, మా ఫ్యామిలీ నుంచి వచ్చిన శివకూ సూపర్‌హిట్ ఇస్తారని, తద్వారా ఆయన కూడా పెద్ద దర్శకుల జాబితాలో పేరు పొందాలని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో శివ మాట్లాడుతూ.. డైరెక్టర్ గారు సెట్‌లో చాలా కూల్‌గా మా నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నారు. వినోద్ యాజమాన్య మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అవుతుంది అన్నారు.
హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. హీరో శివ మంచి ఎనర్జిటిక్ పర్సన్. ఉదయం సెట్‌లోకి అడుగుపెట్టింది మొదలు సాయంత్రం వరకూ అంతే ఎనర్జీతో ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది అన్నారు.
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ.. నేను నటించిన బస్టాప్`, రొమాన్స్` చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డిగారు అనంతరం దర్శకుడిగా ప్రేమకథాచిత్రవ్‌ు`తో విజయం సాధించారు. ఈ సినిమా కూడా విజయం సాధించి దర్శకుడిగా ఆయన మరో సక్సెస్‌ను అందుకోవాలని కోరుకుంటున్నాను. హీరో శివ పాటల్లో అద్భుతంగా కనపడుతున్నాడు. టీం అందరికీ ఆల్‌ది బెస్ట్ అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన కొడాలి సుబ్బారావు ఈ వేడుకకు విచ్చేసి, విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇదొక ఫుల్‌లెంగ్త్ కామెడీ థ్రిల్లర్. హీరో శివ ఈ సినిమాలో బాగా చేసాడు. వినోద్ యాజమాన్య మంచి మ్యూజిక్ ఇచ్చాడు. టెక్నికల్‌గా రిచ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు.
నటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ మల్లయ్యగారు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్‌ను చాలా బాగా చూసుకున్నారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన మా విషయంలో చూపించిన శ్రద్ధ మేం మర్చిపోలేం. ఈ సినిమా విజయం సాధించి వారబ్బాయి శివకు మంచి భవిష్యత్ కలగాలని భగవంతుని కోరుకుంటున్నా. దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి చాలా హార్డ్‌వర్కర్. ఈ సినిమా విజయంతో ఆయన పెద్ద దర్శకుడు కావాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు.
నటుడు పృథ్విరాజ్ మాట్లాడుతూ.. నా ఉన్నతి వెనుక పద్మాలయా సంస్థ ప్రోత్సాహం ఎంతో ఉంది. పద్మాలయా అధినేత కీ॥శే. హనుమంతరావు గారు నాకు మంచి దారి చూపించారు. సంవత్సరం పాటు నాకు వారి సంస్థలో జై వీరహనుమాన్` సీరియల్‌లో నటించడానికి అవకాశం ఇచ్చి నాకు గుర్తింపు తెచ్చారు. అప్పట్లో మల్లయ్యగారితో బాగా కలిసి మెలిసి ఉండేవారం. ఇప్పుడు వారబ్బాయి శివతో కలిసి నటించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించి శివ మంచి హీరోగా నిలబడాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు పోకూరి బాబూరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లక్ష్మీ ఫిలింస్ బోస్, మల్టీడైమెన్షన్ వాసు, శాఖమూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ కృష్ణమహేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శివకు అభినందనలు తెలియజేస్తూ హీరో సుధీర్‌బాబు, శివ లను గజమాలతో సత్కరించారు.
సూపర్‌స్టార్ కృష్ణమహేష్‌సేన అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, ఆలిండియా కృష్ణమహేష్ ప్రజాసేన అధ్యక్షుడు మహ్మద్ఖాదర్‌ఘోరి, సి.హెచ్. జనార్ధన్ యాదవ్, మహ్మద్ జానీ, కాండూరి నరేందర్, కాలేరు శ్రీనివాసరావు, పల్లె జంగయ్యగౌడ్, గుండపనేని జితేందర్, వంశీ, కరీంనగర్ భూపతిరావు, మాసగాని సంతోష్‌కుమార్‌గౌడ్, జగిత్యాల శక్తిరాజ్, నల్లగొండ డాక్టర్ కలీం, భోదాన్ పోచంపల్లి నర్సింహులు, కిరణ్, శ్రీకాంత్, ఖమ్మం తోట దమయంతిరంగారావు దంపతులు, బానోతుకృష్ణ, నర్సాపురం దొంగమోహన్‌రావు, విజయనగరం డి. హుస్సేన్, విజయవాడ వల్లభనేని మహేష్, సాకేత్, కిరణ్, గుంటూరు ఎస్. సుధీర్, తెనాలి శాఖమూరి చందు, గోపి, పెమ్మసాని శ్రీనివాసరావు, కంచెర్ల రమేష్, అడుసుమిల్లి అజిత్, కర్నూల్ అహ్మద్, మున్నా, మక్సూద్ తదితరఅభిమానులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments