అనగనగా ఓ రాజకుమారుడు పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ బాబు , సంజన జంటగా షేర్ దర్శకత్వంలో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకం పై పివి రాఘవులు నిర్మిస్తున్న చిత్రం "అనగనగా ఓ రాజకుమారుడు". ఈ చిత్రంలోని పాటలు సోమావారం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో విడుదలయ్యాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు ఆడియో సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా సంగం చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా లింగంపల్లి కిషన్ రావు మాట్లాడుతూ...మంచి టైటిల్ పెట్టారు. పాటలు బాగున్నాయి. మా నిర్మాత రాఘవులుకు సినిమా అంటే చాలా ఇష్టం. సమాజానికి మంచి సందేశాత్మక చిత్రాలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నారు.దర్శకుడు సీరాజ్...అదే షేర్ ఇదివరకే చక్కటి చిత్రాలను తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...షెరాజ్ ఇదివరకు తీసిన సినిమాలు మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి ఆయన మరో మంచి కథతో రాజకుమారుడిని తీసుకొస్తున్నాడు. అలాగే నిర్మాత రాఘవులు గారు సినిమాల పట్ల అంకిత భావం ఉండే వ్యక్ట్జి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ పెరు నిలబెట్టాలి అన్నారు.
దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఉండే చిత్రమిది.దాంతో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. మా నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహాఁతోనే ఈ చిత్రాన్ని ఎక్కడ కంప్రమైజ్ కాకుండా తెరపైకి తెచ్చాము. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత రాఘవులు మాట్లాడుతూ.. నటి యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు షేర్ చక్కగా తెరపైకి తెచ్చారు. భవిష్యత్తులో తాను మంచి దర్శకుడు గా పెరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలొనే విడుదల చేస్తాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com