గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఊహించని ట్విస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నయీంతో పలువురు పోలీసు అధికారులకు సంబంధం ఉందంటూ నయీంతో వారు చాలా సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అడిషనల్ ఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకూ మొత్తంగా 25 మందిని కళంకితులుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. అటువంటి అధికారులకు తాజాగా సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది. నయీం కేసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీస్ అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
సదరు 25 మంది పోలీసు అధికారులు నయీంతో కలిసి ల్యాండ్ సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అయితే వీరికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదన్న కారణంగా సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయీం కేసుకు సంబంధించి 175కు పైగా చార్జ్‌షీట్లను సిట్ దాఖలు చేసింది. 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నేతల పేర్లు సహా ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకూ అందరికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయీం కేసులో 25 మంది పోలీసు అధికారుల పాత్రపై సిట్ చీఫ్ నాగిరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు లేఖ రాశారు.
నయీం కేసులో క్లీన్ చిట్ పొందిన అధికారులు..
అడిషనల్ ఎస్పీలు..
శ్రీనివాసరావు, చంద్రశేఖర్..
డీఎస్పీలు..
సీహెచ్.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, సాయి మనోహర్.. ప్రకాష్‌రావు, వెంకట నరసయ్య, అమరేందర్‌రెడ్డి, తిరుపతన్న
సీఐలు..
మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయుడు.. కిషన్, ఎస్.శ్రీనివాసరావు, వెంకట్‌రెడ్డి, మజీద్, వెంకట సూర్యప్రకాష్.. రవికిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్‌గౌడ్, రవీందర్..
కానిస్టేబుళ్లు..
దినేష్ ఆనంద్, బాలన్న, సదాత్ మియా
కాగా.. నయీం కేసును లోక్‌పాల్ చట్టం కింద విచారించాలని లోక్‌పాల్‌కు గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో పాటు నయీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా లోక్‌పాల్‌కు సమర్పించి కేసును విచారించాలని కోరింది. ఈ కేసులో నిజానిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. తాజాగా నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వటమనేది ఊహించని ట్విస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments