పసివాడిని పొట్టనబెట్టుకున్న వివాహేతర సంబంధం..
Send us your feedback to audioarticles@vaarta.com
పాపం పుణ్యం ప్రపంచ పోకడ తెలియని పసివాడు. ఏడాదిన్నర వయసు.. తల్లి, మహా అయితే బొమ్మలే ప్రపంచం.. అలాంటి పసివాడిని తల్లి ఏర్పరుచుకున్న వివాహేతర సంబంధం పొట్టనపెట్టుకుంది. హైదరాబాద్ బోరబండలో ఉండే అజయ్లాల్, బర్మా మౌనిక ఇద్దరూ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు పుట్టాడు. అనంతరం మనస్పర్థలు రావడంతో కొడుకుని తీసుకుని మౌనిక వెళ్లిపోయింది. ఆ తరువాత వాషింగ్ మెషీన్ల మెకానిక్ మద్దికుంట రాజు(26)తో వివాహేతర బంధం ఏర్పాటు చేసుకుని అతనితో కలిసి దిల్సుఖ్నగర్లోని కోదండరామ్నగర్లో ఉంటోంది.
వీరిద్దరి సహజీవనానికి బాబు అడ్డు అయిపోయాడని మద్దికుంట రాజు భావించాడో ఏమో కానీ పసివాడని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఎప్పుడు భర్త అజయ్లాల్ తన కుమారుడి కోసం ఫోన్ చేసినా అతనికి మౌనిక పసివాడిని చూపించేది కాదు. వీడియోకాల్ చేసినప్పటికీ చిన్నారిని కనిపించనిచ్చేది కాదు. అలాంటిది సడెన్గా ఫోన్ చేసి బాబుకు ఫిట్స్ వచ్చాయని.. దీంతో పసివాడు మృతి చెందాడని వెల్లడించింది. తన కుమారుడి మృతి చెందాడన్న విషయం తెలుసుకుని అజయ్ లాల్ తల్లడిల్లిపోయాడు.
అయితే తన కుమారుడి మరణంలో ఏదో మిస్టరీ ఉందని అనుమానించాడు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు అజయ్ లాల్ తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశాడు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును సరూర్నగర్ ఠానాకు బదిలీ చేశారు. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. తమదైన స్టైల్లో విచారణ నిర్వహించగా.. మౌనిక ఇంట్లో లేని సమయంలో రాజు.. పసివాడి ఛాతిపై బలంగా కొట్టి హత్య చేసినట్టు రాజు వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments