థమన్ కి ఇదో అనుభవం

  • IndiaGlitz, [Wednesday,August 30 2017]

స‌రైనోడు త‌రువాత స‌రైన విజ‌యమేదీ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఖాతాలో చేర‌లేదు. అయితేనేం.. వారం గ్యాప్‌లో ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి ప్ర‌శంస‌ల‌ను అయితే అందుకున్నాడీ యువ సంగీత ద‌ర్శ‌కుడు. గ‌త వారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా సైరా నర‌సింహా రెడ్డి మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దానికి థ‌మ‌న్ అందించిన సంగీతం మెగాభిమానుల‌ను అల‌రించింది. క‌ట్ చేస్తే.. నిన్న మ‌రో సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్బంగా రాజుగారి గ‌ది 2 ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు.

దీనికీ థ‌మ‌నే మ్యూజిక్ ఇచ్చారు. ఈ పోస్ట‌ర్‌కీ నాగ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తుండ‌డంతో థ‌మ‌న్ ఆనందంగా ఫీల‌వుతున్నాడ‌ట‌. ఏదేమైనా.. వారం గ్యాప్‌లో ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ హీరోల చిత్రాల మోష‌న్ పోస్ట‌ర్లు వారి బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ అవ‌డం.. వాటికి త‌నే సంగీత‌మందించ‌డం అనేది థ‌మ‌న్‌కి గుర్తుండిపోయే అనుభ‌వ‌మే. సైరా న‌ర‌సింహారెడ్డికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నుండ‌గా.. రాజు గారి గ‌ది2కి థ‌మ‌న్ నే సంగీత‌ద‌ర్శ‌కుడు.