ప్రేమమ్ హీరోయిన్ స్థానంలో అమైరా...
- IndiaGlitz, [Wednesday,April 26 2017]
బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తర్ తెలుగు సినిమాలో నటించనుంది. సందీప్‌కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవిని హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా సాయిపల్లవి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సాయిపల్లవి స్థానంలో అమైరా దస్తర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారట. తెలుగు, తమిళంలో అనేకుడు సినిమాలో నటించిన అమైరా తర్వాత జాకీచాన్ కుంగ్‌ఫూ యోగా చిత్రంలో నటించనుంది.