దుబాయ్ లో కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తున్న అమి
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల భామ అమి జాక్సన్... నెల రోజుల క్రితం చెప్పిన వార్తతో అభిమానులు షాక్ అయ్యారు. తన ఫీయన్సి జార్జ్ తో నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ.... తను ప్రెగ్ నెంట్ అని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది.
కానీ జనం మాత్రం ఇదేంటి పెళ్లికి ముందే తల్లి అవుతున్నాను అని ఇంత ఓపెన్ గా చెప్తుంది అని ముక్కున వేలేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ భామ కొత్తగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ షేర్ చేసింది.
దుబాయ్ లో తనకు కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తున్న అమి... తన పొట్ట పైకి వచ్చిందని... తొందర్లో తను అమ్మ కాబోతున్న అని సంబరపడి పోతుంది. నా లిటిల్ ను కలవడానికి చాలా తొందరగా ఉంది అని సంతోషం వ్యక్తం చేసింది. రోబో 2.0 తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వని అమి... ప్రెగ్నెన్సీ డేస్ నీ ఆస్వాదిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout