బన్నితో శంకర్ హీరోయిన్....?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో రాంచరణ్ సరసన ఎవడు` చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఎమీజాక్సన్ అందరికీ గుర్తుండేఉంటుంది. శంకర్ ఐ` చిత్రంతో ఎమీజాక్సన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు తమిళంలోని స్టార్ హీరోస్ అందరితో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోమారు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న 2.0` సీక్వెల్ ఆఫ్ రోబో చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిన్నది స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెలుగు, తమిళంలో రూపొందనున్న భారీ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై త్వరలోనే పూర్తి సమాచారం రావచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments