ప్రభుదేవాలో ఎమీజాక్సన్....

  • IndiaGlitz, [Thursday,May 12 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి'లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఇద్దరు సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్ ను రామోజీ ఫిలింసిటీ లో చిత్రీకరిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ సాంగ్ కోసం భారీ సెట్ ను వేశారు. ఈ సాంగ్ లో ప్రభుదేవాతో ఎమీజాక్సన్ నర్తిస్తుంది.

More News

తెలుగోడు అంటూ నన్ను ఓడించేందుకు చాలా ప్రయత్నాలు చేసారు - హీరో విశాల్

విశాల్-శ్రీదివ్య జంట గా నటించిన చిత్రం రాయుడు.ఈ చిత్రాన్ని ముత్తయ్య తెరకెక్కించారు.విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

టాప్ 5 లో సరైనోడు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సెన్సేషనల్ మూవీ సరైనోడు.

నాగార్జున 'గీతాంజలి' కి 27 ఏళ్లు

'ఏయ్.. లేచిపోదామా?' ఈ డైలాగ్ వినగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా 'గీతాంజలి'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం..

కంట్రోల్ చేసుకుంటున్న కాజల్

బ్రహ్మోత్సవం టీజర్లో కాజల్ కనిపించిన తీరు ఆసమ్.ఈ నెల 20న ఆ చిత్రం విడుదలకు సిద్ధమైంది.దాంతో ప్రస్తుతం కాజల్ తన హిందీ చిత్రం మీద దృష్టి పెట్టింది.

చిరు 150వ చిత్రానికి హీరోయిన్ ఖరారు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార అయితే బాగుంటుంది అనుకున్నారు.