ప్రభుదేవాలో ఎమీజాక్సన్....
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి`లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఇద్దరు సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్ ను రామోజీ ఫిలింసిటీ లో చిత్రీకరిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ సాంగ్ కోసం భారీ సెట్ ను వేశారు. ఈ సాంగ్ లో ప్రభుదేవాతో ఎమీజాక్సన్ నర్తిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com