'క్వీన్' నుంచి తప్పుకుంది
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. 2014లో విడుదలైన ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఇప్పుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
తెలుగులో క్వీన్ పేరుతోనే తమన్నా చేస్తుండగా.. తమిళంలో పారిస్ పారిస్ పేరుతో కాజల్ అగర్వాల్ చేస్తోంది. ఇక కన్నడంలో పారుల్ యాదవ్.. మలయాళంలో మంజిమా మోహన్ రీమేక్ వెర్షన్స్‌లో నటిస్తున్నారు. తెలుగు, మలయాళ చిత్రాలకు మిస్సమ్మ ఫేమ్ నీలకంఠ దర్శకుడు కాగా.. కన్నడ, తమిళ చిత్రాలకు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఒరిజనల్ వెర్షన్లో లిసా హెడేన్ ఓ కీలక పాత్ర చేసింది. గ్లామర్ బేస్డ్ గా సాగే క్యారెక్టర్ అది. ఈ పాత్ర కోసం నాలుగు భాషల్లోనూ ఎమీ జాక్సన్‌ని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర నుంచి ఎమీ తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 2.0లో రజనీకాంత్ సరసన హీరోయిన్గా నటిస్తున్న ఎమీ.. మరో వైపు అమెరికన్ టీవీ సిరీస్ సూపర్ గర్ల్‌లో చేస్తోంది.
దీంతో.. కాల్షీట్ల సమస్య కారణంగా క్వీన్ రీమేక్స్ నుంచి ఆమె తప్పుకుందట. మరి ఎమీ స్థానంలోకి ఎవరు వస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com