'క్వీన్' నుంచి తప్పుకుంది

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

బాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం క్వీన్‌. 2014లో విడుద‌లైన ఈ సినిమాలో కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఇప్పుడు ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగులో క్వీన్ పేరుతోనే త‌మ‌న్నా చేస్తుండ‌గా.. త‌మిళంలో పారిస్ పారిస్ పేరుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ చేస్తోంది. ఇక క‌న్న‌డంలో పారుల్ యాద‌వ్‌.. మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్ రీమేక్ వెర్ష‌న్స్‌లో న‌టిస్తున్నారు. తెలుగు, మ‌ల‌యాళ చిత్రాల‌కు మిస్స‌మ్మ ఫేమ్ నీల‌కంఠ‌ ద‌ర్శ‌కుడు కాగా.. క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌కు ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో లిసా హెడేన్ ఓ కీల‌క పాత్ర చేసింది. గ్లామ‌ర్ బేస్‌డ్ గా సాగే క్యారెక్ట‌ర్ అది. ఈ పాత్ర కోసం నాలుగు భాష‌ల్లోనూ ఎమీ జాక్స‌న్‌ని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆ పాత్ర నుంచి ఎమీ త‌ప్పుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 2.0లో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఎమీ.. మ‌రో వైపు అమెరిక‌న్ టీవీ సిరీస్ సూప‌ర్ గ‌ర్ల్‌లో చేస్తోంది.

దీంతో.. కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా క్వీన్ రీమేక్స్ నుంచి ఆమె త‌ప్పుకుంద‌ట‌. మ‌రి ఎమీ స్థానంలోకి ఎవ‌రు వ‌స్తారో చూడాలి.

More News

మెట్రో స్మార్ట్ కార్డు ధరెంతో తెలుసా ?

3 కారిడార్లలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి తలమానికం కానుంది. నాగోల్ - మెట్టుగూడ 8 కిలో మీటర్ల మార్గం రెండేళ్ల క్రితమే పూర్తయ్యింది.

కాంగ్రెస్ గూటికి రేవంత్

ఎట్టకేలకు రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలుగు దేశం పార్టీ పదవులకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన నేడు రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

రాశీ ఖ‌న్నా అదుర్స్‌

2014లో విడుద‌లైన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశి ఖ‌న్నా. జోరు నుంచి జైల‌వ‌కుశ వ‌ర‌కు కంటిన్యూగా తెలుగు సినిమాలు చేస్తున్న ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్‌తో తొలి ప్రేమ‌, ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు సినిమాలు చేస్తోంది.

తార‌క్‌, చ‌ర‌ణ్ పోటీప‌డ‌నున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మంచి మిత్రులు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ స్నేహం ఆఫ్ స్క్రీన్ వ‌ర‌కే ప‌రిమితం. త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రూ త‌మ సినిమాల‌తో పోటీప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ప్రేమికుల‌కు.. థ‌మ‌న్ గిఫ్ట్‌

ప్రేమికుల‌కు యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఓ మంచి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడంట‌. అయితే.. ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ నుంచి ఎవ‌రైనా ఎలాంటి కానుక‌ని ఆశిస్తారో.. అలాంటి గిఫ్ట్‌నే త‌ను ఇవ్వ‌బోతున్నాడు.