మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార అమీ జాక్సన్.. పెళ్లి కాకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఈ భామ ప్రకటించింది. మరోవైపు తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. ‘2.0’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ లండన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జార్జ్ పయనట్టుతో ప్రేమలో పడింది. పెళ్ళికి ముందే ఎంచక్కా ఎడాపెడా తిరిగేయడం.. డేటింగ్స్, హడావుడిగా ఎంగేజ్మెంట్.. ప్రెగ్నెంట్ ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక్కసారిగా తాను తల్లిని కాబోతున్నానని అమీ సడన్ షాకిచ్చింది. దీంతో ఆమె అభిమానులు, సినీ ప్రియులు కంగుతిన్నారు. తీరా అసలు సంగతి తెలుసుకుని ఆనందపడ్డారు.
ఇదిలా ఉంటే.. "మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని వేచిచూస్తున్నాను. మదర్స్ డే కి (బ్రిటన్‌లో ఈరోజు మదర్స్ డే) మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను (పుట్టబోయే బేబీని ఉద్దేశిస్తూ) ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని వెయ్యి కళ్లతో (కాబోయ్ భర్త- అమీ) ఎదురుచూస్తున్నాం" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అమీ ఇదివరకే చెప్పుకొచ్చింది. తాజాగా.. పండంటి మగబిడ్డ జన్మించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
అయితే ఈ ఇద్దరు ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో..? అసలు ఈ వ్యవహారం పెళ్లిపీటలు దాకా ఎప్పుడువెళ్తుందో..? మళ్లీ ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చి అందచెందాలతో అభిమానులను ఎప్పుడు ఆనందపరుస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout