కాబోయే భర్తతో అమీ జాక్సన్ బ్రేకప్.. అతడి ఫొటోలన్నీ డిలీట్!

  • IndiaGlitz, [Tuesday,July 27 2021]

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.

ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.

ఆ తర్వాత వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. ముద్దుల కొడుకు, కాబోయే భర్తతో అమీ లైఫ్ హ్యాపీగా గడిచిపోతోంది. కానీ ఊహించని విధంగా ఆమె పర్సనల్ లైఫ్ లో చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా అమీ జాక్సన్.. జార్జ్ తో బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అమీ జాసన్ తన సోషల్ మీడియాలో జార్జ్ ఫొటోలన్నింటిని తొలగించింది. జార్జ్ తన కొడుకుతో ఉన్న పిక్స్ కూడా అమీ డిలీట్ చేసింది.

తన బ్రేకప్ పై అమీ జాక్సన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పెళ్లి కాకుండానే తల్లై వార్తల్లో నిలిచిన అమీ జాక్సన్..ఇప్పుడు బ్రేకప్ తో వార్తల్లో కెక్కింది.

More News

పవన్ - రానా మూవీ మేకింగ్ వీడియో.. సర్ ప్రైజ్ అదిరింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజాను బాహుడు రానా దగ్గుబాటి కలసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

'వన్' ట్రైలర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రంగా మమ్ముట్టి

ఓటిటి రిలీజ్ తో పాటు, డబ్బింగ్ చిత్రాల ట్రెండ్ కూడా కొనసాగుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన వన్ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం దక్కించుకుంది.

పవన్ - రానా మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ నేడే!

సోమవారం రోజు పవన్- రానా మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.

ఇంటర్వ్యూ : గ్లామర్ రోల్స్ కి అభ్యంతరం లేదు- తెలుగమ్మాయి మాయ

తెలుగమ్మాయి మాయ నెల్లూరి న్యూజిలాండ్ లో సెటిల్ అయింది. నటనపై ఆసక్తితో టాలీవుడ్ లో అవకాశాల కోసం తిరిగి ఇండియాకి వచ్చింది.

5 భాషలు, ఐదుగురు సింగర్స్.. RRR ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

దర్శకధీరుడు రాజమౌళి సారధ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ స్ట్రాటజీస్ అదిరిపోతున్నాయి.