'అమృతా రామం' ట్రైలర్ విడుద‌ల

  • IndiaGlitz, [Monday,December 23 2019]

రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం అమృతరామ్. సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఎన్ఎస్ పర్సు సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియోన్స్ ను ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత రేకెత్తిస్తోంది. అమృత- రామ్ ల ప్రేమకథకు దృశ్యరూపం ఈ మూవీ. ఆ జంట మధ్య జరిగే సంఘర్షణ, రామ్ ను అమృత ఎంత గాఢంగా ప్రేమించింది. చివరకు వారి ప్రేమ ఎలాంటి త్యాగాన్ని కోరుకుందో రెండు నిమిషాల ట్రైలర్ లో వివరించాడు దర్శకుడు సురేందర్ కొంటాడి.

రామ్ నా కోసం వస్తున్నాడంటూ అమృత మాటలతో మొదలైన ట్రైలర్ ... ప్రేమలో సంతోషాలే కాదు.. త్యాగాలు కూడా ఒక భాగమనే మాటలతో ముగుస్తుంది. అమృతరామమ్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీఅని చెప్పకనే చెబుతున్నాయి..ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.