వర్మపై అమృత ఘాటు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
పరువు హత్యల్లో సంచలనం రేపింది ప్రణయ్ హత్య. మిర్యాలగూడలో జరిగిన ఈ హత్యలో ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు దోషి. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం.. కోర్టుల చుట్లూ ఆయన తిరగడం.. చివరకు ఓరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, విషయాలన్నీ మనకు తెలిసినవే. ఈ నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమాను తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ రిలీజ్ చేశారు. దీనిపై అమృత ఘాటుగా స్పందించారు. మర్డర్ సినిమా తీయడం తనకు ఇష్టం లేదంటూ చెబుతూ ఆమె ఒక లేఖ విడుదల చేశారు.
‘‘ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. పోస్టర్‌ను చూసి సూసైడ్ చేసుకోవాలనిపించింది. ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్నతండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నోచీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు మాత్రమే నేనెంటో తెలుసు. గర్వంతో, పరువు పోతుందనే ఆలోచనల్లో నా తండ్రి ప్రణయ్‌ను కిరాయి గుండాలతో హత్య చేయించారు. ఇప్పటికీ నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మ గౌరవంతో కాలం వెళ్ల దీస్తున్నాను. ఇప్పుడు వర్మ రూపంలో నాకొక కొత్త సమస్య వచ్చింది. ఎదుర్కొనే శక్తి లేదు. ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం మోద్దుబారింది. నా జీవితాన్ని దయుంచి జజారులో పెట్టొద్దు. నా కొడుకుని చూసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఇంతలో వర్మ సమాజం కళ్లను నాపై పడేలా చేశారు. నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూశాను. మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీలాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇలాంటి నీచానికి దిగజారుతావనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లిలేనందుకు నిన్ను చూసి జాలేస్తుంది. నీపై ఎలాంటి ఎలాంటి కేసులు వేయను. ఈ నీచ, నికృష్ట, స్వార్ధపూరిత సమాజంలో నువ్వూ ఒక్కడివే. ఎన్నో బాధలను అనుభవించాను. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్’’ అని అమృత తన లేఖలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com