పెళ్ళి కూతురు కానున్న అమృత ఫేం కీర్తన
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటులు పార్తీపన్, సీత (ముద్దుల మావయ్య, సింహాద్రి ఫేమ్) గారాల పట్టి కీర్తన పెళ్లి కూతురు కాబోతోంది. 2002 సంవత్సరంలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తమిళంలో రూపొందించిన కన్నత్తిల్ ముత్తమిట్టల్` (తెలుగులో అమృత`) సినిమాలో మాధవన్, సిమ్రన్ పెంపుడు కూతురిగా నటించిన కీర్తన.. ఆ చిత్రంలోని తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.
అంతేగాకుండా, ఈ చిత్రానికిగానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత నటనకు దూరమైన కీర్తన.. దర్శకత్వ విభాగంలో పనిచేసింది. ఇప్పుడు అక్కినేని వారి ఇంట కోడలు కాబోతోంది. ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ అక్కినేనితో మార్చి 8న కీర్తన కళ్యాణం జరుగనుంది. అక్షయ్ 2014లో వచ్చిన హిందీ చిత్రం పిజ్జా`తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కాగా, పార్తీపన్ ఇప్పటికే అతిథులందరికీ ఆహ్వానాలు కూడా పంపినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout