అమృతకు వార్నింగ్.. ఇంకెన్నాళ్లిలా.. ఎందుకిలా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
పెరుమాళ్ల ప్రణయ్ ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. నల్గొండలో జరిగిన కుల దురహంకారానికి ప్రణయ్ బలయ్యాడు.! అప్పటికే గర్భవతిగా ఉన్న అమృత.. కొన్ని రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నాటి నుంచి నేటి వరకూ ఆమెకు వేధింపులు మాత్రం తపట్లేదు. ప్రణయ్‌ను హత్య చేసిన కేసులో అమృత్ తండ్రి, బాబాయ్‌తో పాటు పలువుర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం.. కొన్ని రోజుల క్రితం మళ్లీ ఆ నిందితులను బెయిల్‌పై బయటికి వదలడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. ఇక ఎవరి బతుకు వాళ్ల బతుక్కుంటున్నారనుకునే టైమ్‌కు మళ్లీ అమృతకు వేధింపులు మొదలయ్యాయి.
ప్రణయ్‌ను మరిచిపోవాలని.. లేకపోతే పరిణామాలు మామూలుగా ఉండవని హెచ్చరిస్తూ అమృత నివసిస్తున్న ఇంటికి ఓ ఆగంతకుడు అంటించి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇలా ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? ఇందులో అమృత వాళ్ల తల్లిదండ్రుల హస్తం ఉందా లేకుంటే..? ఇంకెవరు ఇలా చేశారు..? అమృత ఏం చేయాలని వారు భావిస్తున్నారు..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా ప్రణయ్ హత్య జరిగిన టైమ్‌లో జిల్లా ఎస్పీ.. అన్నీ విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం విదితమే. మరి తాజా పరిణామంతో పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments