మారుతీరావు ఆత్మహత్య.. ఆయనపైనే అమృతకు డౌట్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు కూడా ముగిశాయి. అయితే ఆయన అంత్యక్రియలకు వెళ్లిన అమృతను కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తండ్రిని కడసారి చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన అమృత సంచలన ఆరోపణలు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మారుతీరావు ఆత్మహత్యపై..
మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మారుతీరావును బాబాయ్ శ్రవణ్ కొట్టినట్లు సంచలన ఆరోపణ చేసింది. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తాను చెప్పలేనుకానీ మనిషిని చంపించేంత ధైర్యం ఉన్న వాళ్లు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వారు కాదని తెలిపింది. ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదని.. తాను ఇంటి నుంచి బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని స్పష్టం చేసింది. భర్త చనిపోతే భార్య పడే బాధలు తనకు తెలుసని.. మీడియాకు ముందు చెప్పుకొచ్చింది.
ఆయనపైనే అనుమానాలు..
‘బాబాయ్ నుంచి అమ్మకు ప్రాణహానీ ఉంటుంది. శ్రవణ్ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేశాడనుకుంటున్నాను. శ్మశనవాటికకు వెళ్తే అడ్డుకున్నారు. శ్రవణ్ కూతురు నన్ను నెట్టేసింది. మారుతీరావును శ్రవణ్ కొట్టాడని తెలిసింది. ఒత్తిడి వల్ల ఆయన చనిపోయాడని నేను అనుకోవట్లేదు. వీలునామాలో శ్రవణ్ పేరు ఉంటే అనుమానం వస్తుందని తీయించారేమో. శ్రవణ్ ముఖంలో ఎక్కడైనా బాధ కనిపించిందా..?. కరీంతో పాటు చాలా మంది పేర్లపై బినామీ ఆస్తులున్నాయి. నా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు’ అని బాబాయ్‌పై అమృత పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. శ్రవణ్ మాత్రం.. మారుతీరావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవని.. చాలా రోజులుగా తామిద్దరి మధ్య మాటల్లేవని మీడియా ముందు కుండ బదధలు కొట్టాడు.
అమ్మ దగ్గరికి వెళ్లను..!
అమ్మదగ్గరికి నేను వెళ్లను కానీ.. ఆమే నా దగ్గరికి వచ్చి ఉంటానంటే నాకు అభ్యంతరంలేదు.. రావొచ్చు. నా భర్త ప్రణయ్ చనిపోతే ధైర్యం ఉన్నట్లే.. తండ్రి చనిపోయినా ధైర్యంగానే ఉన్నాను. అలాగని నాకు బాధలేదని కాదు. ప్రణయ్ కుటుంబాన్ని వదిలి మా అమ్మ దగ్గరికి వెళ్లడం సాధ్యం కాదు. శ్రవణ్ వల్ల మా అమ్మకి భవిష్యత్‌లో ప్రమాదం ఉంటుంది అనుకుంటున్నాను’ అని అమృత సంచలన ఆరోపణలు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout