ఈ రెండింటిలో సూర్య దేనికి ఓటేస్తాడో

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

సింగం3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న హీరో సూర్య నెక్ట్స్ సినిమాను క‌బాలి ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌నేది అన‌ధికార స‌మాచారం. నిజానికి మ‌ద్రాస్ తర్వాత పా రంజిత్, సూర్య‌తో సినిమా చేయ‌డానికి స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అయితే అనుకోకుండా రజ‌నీకాంత్ నుండి పిలుపు రావ‌డంతో సూర్య కూడా పా రంజిత్‌ను క‌బాలి సినిమా చేయ‌మ‌ని ఎంక‌రేజ్ చేశాడు.

ఇప్పుడు క‌బాలి విడుద‌ల‌వుతుంది. త‌ర్వాత రంజిత్ సూర్య సినిమాపై కాన్‌స‌న్ ట్రేష‌న్ చేయ‌బోతున్నాడు. సూర్య కోసం పా రంజిత్ రియ‌ల్ ఎస్టేట్ కాన్సెప్ట్‌పై ఓ క‌థ‌, బాక్సింగ్ కాన్సెప్‌పై ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. మ‌రి సూర్య ఈ రెండు క‌థ‌ల్లో దేనికి ఓటేస్తాడో చూడాలి మ‌రి...