'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం
Thursday, April 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే`. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వడం తో ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది.
ఈ సందర్బంగా దర్శకుడు మణి మాట్లాడుతూ నాకు ఇది రెండవ సినిమా.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హర్ష కు ప్రత్యేక కృతఙ్ఞతలు.
ఒక జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారు ప్రేమలో లేకపోతే ఎలా ఉంటారు అనే ట్రూ లవ్ పైన ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి కథ మరియు మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తో సినిమాను చేస్తున్నాం. మే లో అరకు ప్రాంతాలల్లో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చిత్రం లో 5 పాటలుంటాయి. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తో ఉన్నానంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు భాను ప్రసాద్ తెలిపారు.
ఇక ఈ చిత్ర కెమెరామెన్ ఫణి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు మణి కు నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా లో విసువల్ పరంగా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నా.. అది ఈ సినిమా కు ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పారు. ఇంకా ఈ ప్రారంభిత్సవం లో హీరోయిన్ షాను తో పాటు నిర్మాత హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి లు పాల్గొని అభినందనలు మరియు అభిప్రాయాలను తెలియ చేసారు.
ఈ చిత్రానికి హీరో మణి, హీరోయిన్ షాను, సంగీతదర్శకుడు భానుప్రసాద్, రైటర్ బండోజి, కెమరామెన్ ఫణి, కారియోగ్రఫర్ సూర్య, నిర్మాతలు హర్షవర్ధన్ మరియు రమేష్ బి. దర్శకుడు మణి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments