'అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల' టీజర్ లాంఛ్
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన్ ఫిలింస్ పతాకంపై ప్రసాద్ లక్కన, లీల ప్రధాన పాత్రలో ప్రసాద్ లక్కన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం అమ్మాయి గోల శ్రీకృష్ణ లీల`. ఆక్యుప్రైజర్ వైద్య ప్రధానంగా ఇది తెరకెక్కించబడిరది. ఇటీవల ఫిలిం చాంబర్లో సినిమా టీజర్‌ను తెంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మెన్ ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రముఖ నిర్మాతలు పి. సత్యారెడ్డి, మోహన్‌గౌడ్ లు ఆవిష్కరించారు.
ఈ సంధర్బంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ... ఆరోగ్యపరంగా మనిషికి బ్రతికినంత కాల ఉపయోగపడే ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు. ఈ చిత్రం చూసిన వారికి ఆనందంతో పాటు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సమాజ శ్రేయస్సును కోరి చిత్రాన్ని నిర్మించినందుకు ప్రసాద్ లక్కన గారిని అభినందిస్తున్నాను అన్నారు.
పి. సత్యారెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడిరచిన ప్రసాద్ లక్కన గారు వైద్య ప్రధాన చిత్రం తీయడం చాలా సంతోషించదగ్గది. దీని ద్వారా ప్రజులు ఎన్నో ఆరోగ్య సంబంధ విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ప్రసాద్ గారు ఇప్పటి వరకూ పబ్లిసిటీకి దూరంగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన వైద్య విధానం గురించి కూడా అందరూ తెలుసుకుంటారు అన్నారు.
మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. వైద్య వృత్తిని దైవంగా భావించిన అతి కొద్ది మందిలో ప్రసాద్ గారు కూడా ఒకరు. ఈయన ట్రీట్మెంట్ వ్ల ఎన్నో దీర్ఘకాల రోగాల నయం అయిన విషయం చాలా మందికి అనుభవమే. వైద్య రంగంలో సాధించినట్లుగానే సినిమా రంగంలో కూడా ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శక, నిర్మాత ప్రసాద్ లక్కన మాట్లాడుతూ.. సినిమా అంటే చాలా పవర్ఫుల్ మీడియా. కాబట్టే దీని ద్వారా ప్రజలకు ఉపయోగ పడేలా ఆక్యుప్రైజర్ వైద్య విధానాన్ని చెప్పదలచుకున్నాను. అందరినీ అకట్టుకునే అంశాలను మిళితం చేస్తూ నేను సమాజానికి చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పాను. నేటి యువతకు కావాల్సిన వినోదంతో పాటు ఆరోగ్య సంబంధమైన ఆలోచనల రేకెత్తించే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రాన్ని లాభాపేక్ష కోసం చేయలేదు. అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన ఉండానేదే నా తపన. ఈ చిత్రం ద్వారా ఇంగ్లీష్ మందుకు, సైడ్ ఎఫెక్ట్స్‌కు ఎలా దూరంగా ఉండాలి అని చెపుతూనే... అతి తక్కువ ఖర్చు అయ్యే ఆక్యుప్రైజర్ వైద్యం మనకు ఎంతటి ఉపయోగకారి అనేది కూడా వినోదాత్మకంగా చిత్రీకరించాం అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో శ్రీకర సంగమేశ్వర, యార్లగడ్డ శైలజ, సాత్విక, శ్యాంబాబు, జయలక్ష్మి, డా॥ ప్రవీణ్, నలబిల్లి విజయ కుమార్, రమణ, చాందిని నటిస్తుండగా, కెమెరా: ఆనంద్, ఎడిటింగ్: వర్మ, రాము., రీరికార్డింగ్: శ్రీనివాసరావు, కథ, మాటలు, విధ్వాన్ ప్రసాద్. నిర్మాత, దర్శకత్వం: ఎస్.ఎస్.వి. ప్రసాద్ లక్కన.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com