డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల్లో 'అమ్మ‌మ్మ‌గారిల్లు'

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు  ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. యూ ట్యూబ్ లో టీజ‌ర్ దూసుకుపోతుంది. నేటి జ‌నులంతా తమ బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. అలాగే  మేడే సంద‌ర్భంగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ' చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి వివేష స్పంద‌న ల‌భిస్తోంది.  పలువురు సినీ పెద్ద‌లు కూడా టీజ‌ర్ చూసి ఎంతో బాగుంద‌ని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగిపోతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

More News

ప‌దేళ్ళ ప‌రుగు

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప‌రుగు ఒక‌టి.

అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.

చిరు ట్యాగ్ లైన్‌తో సాయిధ‌ర‌మ్

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌..

అనుకున్న స‌మ‌యానికే ర‌వితేజ సినిమా

మాస్ మ‌హారాజా ర‌వితేజని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చిన చిత్రం రాజా ది గ్రేట్‌.

విక్ర‌మ్ కుమార్‌కు నో చెప్పిన నాని

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. అయితే ఇటీవ‌ల‌ విడుద‌లైన హ‌లో నిరాశ‌ప‌రిచింది.