'అమ్మమ్మగారిల్లు' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్ సహా నిర్మాతగా రాజేష్ నిర్మించిన ‘అమ్మమ్మగారిల్లు’ శుక్రవారం విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
నటుడు రావు రమేష్ మాట్లాడుతూ, `అన్ని పాత్రలు సినిమాలో పండాయి. సినిమా బాగుంది అనడాని కి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీ రాజా పాత్రలు. లాక్ యువర్ ఏజ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆ పాత్రల్లో అంతా ఇన్వాల్స్ అయి నటించారు కాబట్టే ఇంత మంచి పేరు వచ్చింది. 2008 నుంచి 2018 వరకూ ప్రతీ రోజు నాకు గుర్తిండిపోతుంది. నా అనుభవాలను ఇతరులతో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పదేళ్లు నా లాక్ ఏజ్. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు` అని అన్నారు.
సహ నిర్మాత కె.ఆర్ మాట్లాడుతూ, ` మా సినిమా హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్ గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్. ప్రమోషన్ కు మేము అడగకుండానే నటీనటులు అంతా పాల్గొంటున్నారు. సినిమా ఒక వారం ఆడితే ఇంకా బాగుంటుంది` అని అన్నారు.
దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ` రసూల్ మా సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు. కళ్యాణ్ మాలిక్ ఆయన స్టైల్లో రెండు మెలోడీస్ ఇచ్చారు. సాయి కార్తీక్ ఆర్. ఆర్ నెక్స్ట్ లెవల్లో అందిచారు. జె.పి ఎడిటింగ్ బాగా కుదిరింది. రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డారు. నా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన రాము , వంశీ, మధు ఎంతో కష్టపడ్డారు. వాళ్లు భవిష్యత్ లో గొప్ప దర్శకులు అవ్వాలి. సినిమా విషయానికి వస్తే ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలి చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేసాను. వండర్ ఫుల్ మూవ్ మెంట్ ఇది. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. నా పన్నెండు ఏళ్ల కల ఈ సినిమా తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా పర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అని అన్నారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ` రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. వీళ్లు ఇంకా మంచి సినిమాలు చేయాలి. మంచి హిట్లు కొట్టాలి. తెలుగు ఇండస్టీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగా ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్` అని అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ, `ప్రతీ పాత్ర వేటికవి ప్రత్యేకంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేసాను. అంతా పాత్రలు నమ్మి సినిమా చేసాం. ఈరోజు మా నమ్మకం నిజమైంది. మంచి సినిమా చేసామని అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. లాక్ యువర్ ఏజ్ అనేది ఇబ్బంది గా ఉందని సెట్స్ లో అనుకున్నాం. కానీ సినిమాకు అదే ఆయువు పుట్టులా నిలిచింది. సినిమా గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు అంటే కారణం `లాక్ యువర్ ఏజ్ అన్నదే కారణం` అని అన్నారు.
సుధ మాట్లాడుతూ, ` రీల్ లైఫ్ లోనే కాదు. రియల్ లైఫ్ లో కూడా ఏడిపించే తమ్ముడు ఉన్నాడు. రెండు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. టూ వీలర్ నేర్చుకోవడం నా లాక్ ఏజ్. రిలేషన్స్ నెవర్ ఎండ్. ఇది అందరికీ సంబంధించింది. అందుకే సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకలకు కనెక్ట్ అయింది` అని అన్నారు.
ఇంకా ఈ వేడుకలో మధుమణి, రూపలక్ష్మి, శక్తి, చందు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments