'అమ్మమ్మగారిల్లు' శాటిలైట్ రైట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్టు లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో టీజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ` చక్కటి కుటుంబ కథా చిత్రం కావడం..స్వచ్ఛమైన తెలుగు టైటిల్ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా శాటిలైట్ భారీ ధరకు అమ్ముడుపోయింది. ప్రముఖ జెమిని టీవీ ఛానల్ సినిమా శాటిలైట్ హక్కులను 2.75 కోట్లకు తీసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత గా పెరుగుతున్నాయి.
అలాగే ఓవర్సీస్ బిజినెస్, హిందీ రైట్స్ కు సంబంధించి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నాగ శౌర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ గా నిలుస్తుంది. మిగతా నటీనటులంతా కూడా చాలా చక్కగా నటించారు. దర్శకులు ప్రతీ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా..అందంగా చూపించారు. వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు.
`అమ్మమ్మగారిల్లు` చిత్ర నిర్మాతలకు మార్కెట్ లో మంచి పేరు ఉండటం వల్ల స్టార్ హీరోలు సైతం ఈ బ్యానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com