కొత్త టెక్నాలజీతో అమ్మడు సాంగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం భారీ స్ధాయిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. చిరు, కాజల్ పై చిత్రీకరించిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ రిలీజ్ చేసిన 24 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ను జి.ఎఫ్.ఎం డాలీ అనే కొత్త కెమెరాతో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిత్రీకరించారు.
ఈ విషయాన్ని రత్నవేలు ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...ఎ రోలర్ కాస్టర్ రైడ్ ఫర్ కాజల్ అంటూ కాజల్ తో రత్నవేలు ఉన్న వర్కింగ్ స్టిల్ ను కూడా పోస్ట్ చేసారు. అందాల తార కాజల్ అగర్వాల్ ను ఈ కొత్త కెమెరా ఇంకెంత అందంగా చూపించనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెం 150 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments