కొత్త టెక్నాల‌జీతో అమ్మ‌డు సాంగ్..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఖైదీ నెం 150 చిత్రం భారీ స్ధాయిలో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. చిరు, కాజ‌ల్ పై చిత్రీక‌రించిన అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సాంగ్ రిలీజ్ చేసిన‌ 24 గంట‌ల్లో 2 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ను జి.ఎఫ్.ఎం డాలీ అనే కొత్త కెమెరాతో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు చిత్రీక‌రించారు.

ఈ విష‌యాన్ని ర‌త్న‌వేలు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...ఎ రోల‌ర్ కాస్ట‌ర్ రైడ్ ఫ‌ర్ కాజ‌ల్ అంటూ కాజ‌ల్ తో ర‌త్న‌వేలు ఉన్న‌ వ‌ర్కింగ్ స్టిల్ ను కూడా పోస్ట్ చేసారు. అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఈ కొత్త కెమెరా ఇంకెంత అందంగా చూపించ‌నుందో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖైదీ నెం 150 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఆ ఇద్దరు హీరోలును చూసి జెలసీగా ఫీలవుతా - చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీలోని హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.వేరే హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే ఫోన్ చేసి అభినందిస్తుంటాడు.

సైఫ్, కరీనాకు అబ్బాయి పుట్టాడు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ 2012లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే.

రాజశేఖర్ మరోసారి

పోలీస్, సి.బి.ఐ పాత్రలకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్రహం, మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్లో రాజశేఖర్ మెప్పించారు.

మ‌న్మ‌ధుడుకు 14 ఏళ్లు..!

న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున హీరోగా విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మ‌న్మ‌ధుడు. నాగార్జున‌, సోనాలి బింద్రే, అన్షు హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ - మాట‌లు అందించారు.

'అవంతిక' అసాధారణ విజయం సాధించాలి! - కొణిజేటి రోశయ్య

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 90వ చిత్రం 'అవంతిక'