గోపీచంద్ కి అతనొక్కడే మిగిలాడు

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

'లౌక్యం'తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు గోపీచంద్‌. ఇప్పుడు వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా మారాడు. విశేష‌మేమిటంటే.. అలా అత‌న్ని బిజీగా చేస్తున్న సినిమాల‌న్నీ ఆల్‌రెడీ త‌న‌తో హిట్ చిత్రాల‌ను తీసిన ద‌ర్శ‌కుల‌వే కావ‌డం విశేషం.

'య‌జ్ఞం' ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రితో 'సౌఖ్యం' చేస్తున్న గోపీ.. 'ఆంధ్రుడు' డైరెక్ట‌ర్ ప‌రుచూరి ముర‌ళితో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఇంత‌కుముందు 'ల‌క్ష్యం' ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ తో 'లౌక్యం'.. 'ఒక్క‌డున్నాడు' డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో 'సాహ‌సం'.. 'శౌర్యం' ద‌ర్శ‌కుడు శివ‌తో 'శంఖం' సినిమాలు చేశాడు గోపీ.

ఇక త‌న‌కు హిట్‌నిచ్చిన ద‌ర్శ‌కుల్లో రెండో ఛాన్స్ ప‌రంగా వెయిట్ చేస్తోంది ఒక్క అమ్మ రాజ‌శేఖ‌ర్‌నే. 'ర‌ణం' త‌రువాత మ‌ళ్లీ హిట్ లేని అత‌నికి గోపీనే మ‌రోసారి లైఫ్ ఇస్తాడేమో చూడాలి.

More News

'అయ్యో రామ' పాటలు విడుదల

పవన్ సిద్ధు,కామ్నా సింగ్,నిషిత హీరో హీరోయిన్లుగా యానీ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ కుమార్ దర్శకత్వంలో గంటా రామక్రిష్ణా నిర్మించిన చిత్రం అయ్యో రామ.

సోనాల్ కి ఇక ఆ ఛాన్స్ లేనట్టే

అందాల ఆరబోతకు ఏ మాత్రం అభ్యంతరం చెప్పని నటీమణుల్లో సోనాల్ చౌహాన్ ఒకరు.కథ డిమాండ్ చేయకపోయినా సరే బికినీల్లో దర్శనమివ్వగలదీ సుందరి.

'లోఫర్ ' లోనూ పూరీ ఫార్ములా అదేనా?

పూరీ జగన్నాథ్ సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది.అదే సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.

కమల్, నాగే ఒకేలా..

ఓ వైపు కమల్ హాసన్,మరో వైపు నాగార్జున..ఈ ఇద్దరూ తమ కొత్త సినిమాలతో..సినిమా ప్రియులను అలరించేందుకు ఒకేలా ఆలోచించి ముందుకు అడుగేశారు.

'డిక్టేటర్' డేట్ ఫిక్స్..

నందమూరి నట సింహా్ం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి,సోనాల్ చౌహన్ నటిస్తున్నారు.