గోపీచంద్ కి అతనొక్కడే మిగిలాడు
Send us your feedback to audioarticles@vaarta.com
'లౌక్యం'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు గోపీచంద్. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా మారాడు. విశేషమేమిటంటే.. అలా అతన్ని బిజీగా చేస్తున్న సినిమాలన్నీ ఆల్‌రెడీ తనతో హిట్ చిత్రాలను తీసిన దర్శకులవే కావడం విశేషం.
'యజ్ఞం' దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరితో 'సౌఖ్యం' చేస్తున్న గోపీ.. 'ఆంధ్రుడు' డైరెక్టర్ పరుచూరి మురళితో మరో సినిమా చేయనున్నాడు. ఇంతకుముందు 'లక్ష్యం' దర్శకుడు శ్రీవాస్ తో 'లౌక్యం'.. 'ఒక్కడున్నాడు' డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటితో 'సాహసం'.. 'శౌర్యం' దర్శకుడు శివతో 'శంఖం' సినిమాలు చేశాడు గోపీ.
ఇక తనకు హిట్‌నిచ్చిన దర్శకుల్లో రెండో ఛాన్స్ పరంగా వెయిట్ చేస్తోంది ఒక్క అమ్మ రాజశేఖర్‌నే. 'రణం' తరువాత మళ్లీ హిట్ లేని అతనికి గోపీనే మరోసారి లైఫ్ ఇస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com