నోయెల్ ఒక సైకోగాడన్న అమ్మ.. ఈ వారం నో ఎలిమినేషన్..

  • IndiaGlitz, [Monday,November 02 2020]

సండే.. రానే వచ్చింది. ఇవాళ హౌస్‌లో సందడే సందడి. ఫన్ డే నిజంగా అదిరిపోయింది. జర జరా నవ్వరాదే పిల్లా సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నిన్న రాత్రి షో ముగిసిన అనంతరం జరిగినదాన్ని హోస్ట్ నాగార్జున చూశారు. అమ్మ రాజశేఖర్.. నోయెల్‌ ఒక సైకో గాడని తెలిసిందన్నారు. ఇక అవినాష్ అయితే నాది చిల్లర కామెడీ అంటాడా? అంటూ రెచ్చిపోయాడు. నేను టెంపరరీ ఫ్రెండ్ అని రాసినందుకే నన్ను బ్లేమ్ చేశాడన్నాడు. వాడి కేరెక్టర్ ఇప్పుడు తెలిసిపోయిందని.. ఫేక్ అని తేలిందని.. స్వామీజీలా యాక్ట్ చేశాడని ప్రేక్షకులు తెలుసుకోండన్నారు. నోయెల్‌కి విన్ అవ్వాలని ఉందని మధ్యలో వెళ్లిపోయేసరికి ఇలా బ్లేమ్ చేశాడని అమ్మ రాజశరేఖర్ ఆరోపించారు. ఇక సన్‌డే ఫన్‌డేలో భాగంగా అభి, అఖిల్ గ్రూపులుగా విడదీశారు. మ్యూజిక్ రాగానే బజర్ నొక్కి సాంగ్ ఏంటో చెప్పాలి. ఆ సాంగ్ ఏంటో చెప్పిన వాళ్ల గ్రూపు నుంచి ఎవరైనా వచ్చి డ్యాన్స్ చేయాలి. తొలి బజర్‌ను అభి నొక్కాడు. దారి చూడు దమ్ము చూడు సాంగ్‌కి సొహైల్, మోనాల్ డ్యాన్స్ ఇరగదీశారు. నెక్ట్స్ కూడా బజర్‌ను అఖిలే నొక్కాడు. మెగాస్టార్ సాంగ్‌కి అవినాష్, లాస్య డ్యాన్స్ చేశారు. నెక్ట్స్ బజర్‌ను అఖిల్ ప్రెస్ చేసినా సాంగో చెప్పలేకపోయాడు. తరువాత బజర్‌ను అభి ప్రెస్ చేశాడు. ఎన్టీఆర్ సాంగ్‌కు గ్రూప్ డ్యాన్స్ చేశాడు. ఫైనల్‌గా రామ్ చరణ్ సాంగ్‌తో ఈ రౌండ్ ముగిసింది.

అఖిల్ యాపిల్స్‌ను తీసుకొస్తే వాటిని అభి కట్ చేయగా వాటిలో మోనాల్ ఫోటో వచ్చింది. తనను నామినేట్ చేసిన అభియే సేఫ్ చేయడంతో మోనాల్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. నిన్న అవినాష్ మిమిక్రీ చేసే వాళ్లందరినీ నోయెల్ అవమానించాడు అన్నారు. దానికి అందరూ మిమిక్రీ చేసి చూపించారు. ఒక సీన్ ఇస్తే దానిని చేసి చూపించాలి. అవినాష్‌తోనే దీనిని స్టార్ట్ చేశారు. మోనాల్ మొన్న ముద్దు పెట్టిన సీన్‌‌లో అవినాష్ ఎలా ఫీల్ అయ్యాడో అరియానా చేసి చూపించింది. తరువాత అవినాష్ చేస్తే నాగ్ స్పాంటీనియస్‌గా ఫుల్ కామెడీ చేశారు. అవినాష్.. మోనాల్, అరియానాలతో ఫ్లర్ట్ చేసేటప్పుడు అవినాష్ ఎలా చేస్తాడో అఖిల్ చేసి చూపించాడు. హారిక ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడుతుందో అవినాష్ చేసి చూపించాడు. అమ్మ నామినేట్ అయిన తరువాత ఇంటి సభ్యులు రీజన్స్ చెబుతుంటే ఎలా బిహేవ్ చేస్తారో సొహైల్ చేసి చూపించాడు. ఎవరైనా అమ్మ రాజశేఖర్‌తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అవినాష్ చేసి చూపించాడు. మోనాల్‌లా వాక్ ఎలా చేస్తుందో లాస్య చేసి చూపించింది. మోనాల్ ఎలా ఏడుస్తుందో సొహైల్ చేసి చూపించాడు. అరియానా కెప్టెన్సీ టైమ్‌లో ఎలా బిహేవ్ చేస్తుందో అవినాష్ చేసి చూపించాడు. మోనాల్ ఎలిమినేట్ అయి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు అఖిల్ ఎలా బిహేవ్ చేశాడో అభి చేసి చూపించాడు. తరువాత సొహైల్ కోపంలో ఉన్నప్పుడు ఎలా? కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు ఎలా చేస్తాడో మెహబూబ్ చేసి చూపించాడు. తరువాత లాస్య పప్పు ఇన్సిడెంట్‌ని అవినాష్.. ఎవరైనా మాట్లాడుకుంటుంటే అవి తనకు తెలియకుంటే తెలుసుకునేందుకు లాస్య ఎంతలా తాపత్రయ పడుతుందనేది హారిక చేసి చూపించింది.

నెక్ట్స్ నాగ్.. అరియానాను సేఫ్ చేశారు. ఇక నామినేషన్స్‌లో అమ్మ, మెహబూబ్ మాత్రమే మిగిలారు. తరువాత ఆడియెన్స్ కాల్.. అభికి వచ్చింది. విజయవాడ నుంచి లక్ష్మి అనే మహిళ కాల్ చేసి ప్రతి వారం నామినేషన్స్‌ను ఫేస్ చేసినప్పుడు మీకెలా అనిపించింది? అని అడిగితే అభి ఆన్సర్ చేశాడు. తరువాత నామినేషన్స్‌లో ఉన్న ఇద్దరినీ నాగ్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. కంటెస్టెంట్ల ఎదుట అమ్మ, మెహబూబ్ ఉన్న బోర్డును పెట్టారు. కంటెస్టెంట్‌లంతా ఈ హౌస్‌కి ఎవరు అవసరం.. ఎవరు అవసరం లేదో చెప్పాలని నాగ్ అడిగారు. మొదట అఖిల్ వచ్చి అమ్మ అవసరం లేదని చెప్పాడు. తరువాత అభి వచ్చి అమ్మ అవసరం లేదని చెప్పాడు. సొహైల్ వచ్చి కూడా అమ్మ అవసరం లేదని చెప్పాడు. తరువాత మోనాల్, లాస్య, హారిక హౌస్‌కి అమ్మ అవసరం లేదని చెప్పారు. అరియానా, అవినాష్ అమ్మ రాజశేఖర్‌కి ఓటు చేశారు. తరువాత అమ్మ, మెహబూబ్‌తో నాగ్ మాట్లాడారు. మెహబూబ్ సేఫ్ అని చెప్పి లోపలికి పంపించారు. తరువాత కాస్త హైడ్రామా నడిపి అమ్మను కూడా సేఫ్ చేశారు. నోయెల్ వెళ్లే ముందు ఎవ్వరినీ ఎలిమినేట్ చేయవద్దని రిక్వెస్ట్ చేశాడని అందుకే ఎలిమినేట్ చేయలేదని నాగ్ చెప్పారు. అంతే కాకుండా అమ్మ రాజశేఖర్‌కు నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అమ్మ బయటకు వెళ్లాలని కోరుకున్నారు కాబట్టి ఆయనను డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్‌ని చేశారు. ఇక రేపు నామినేషన్స్‌లో గుడ్డు కొట్టి నామినేట్ చేయడానికి కారణాలను చెప్పాలని ప్రోమోను బట్టి తెలుస్తోంది.

More News

`ఆచార్య‌` స్క్రిప్ట్ విష‌యంలో కొర‌టాల త‌గ్గ‌డం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై

తెలంగాణలో ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్..

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి తన సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.

వైభవంగా సిరివెన్నెల కుమారుడి వివాహం..

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వైభవంగా జరిగింది.

ఏపీలో మరో కొత్త పార్టీ..

ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.