‘అమ్మ’ నీ పెర్ఫార్మెన్సో.. ఆస్కార్ లెవల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్న షో.. బిగ్‌బాస్. ఈ సారి షోలో పెద్దగా తెలిసిన మొహాలు లేకపోవడంతో ప్రేక్షకులు సైతం మొదట్లో ఆసక్తి కనబరచలేదు. కానీ తర్వాత చిన్నచిన్నగా షోపై ఆసక్తి బాగా పెరిగింది. కంటెస్టెంట్లంతా మంచి పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. ఇప్పటి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. ఆరో కంటెస్టెంట్ ఇవాళ వెళ్లిపోనున్నారు. అయితే శనివారం రాత్రి బిగ్‌బాస్ షో చూసిన వారెవరికైనా ‘అమ్మ’ నీ పెర్ఫార్మెన్సో.. ఆస్కార్ లెవల్.. అని అనిపించకమానదు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్‌ను చూశాం.
టాస్క్‌లో భాగంగా హాఫ్ షేవ్ చేసుకోవాలంటే ముందుకు రాని అమ్మ రాజశేఖర్.. రాత్రి మాత్రం హాఫ్ షేవ్ అనగానే ఎత్తిన చేతిని దించకుండా నిలబడిపోయారు. కారణం.. నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటి. హాఫ్ షేవ్ చేయించుకున్నవారు వచ్చేవారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటి పొందటం కానీ లేదంటే ఎవరినైనా నామినేషన్స్ నుంచి సేఫ్ చేయడం కానీ చేయవచ్చనగానే అమ్మ రాజశేఖర్ తాను చేస్తానంటూ ముందుకొచ్చారు. నాగ్ కొంత సమయం ఇచ్చినప్పటికీ అమ్మ రాజశేఖర్ మినహా హాఫ్ షేవ్ చేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయనకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు అమ్మ రాజశేఖర్ హాఫ్ షేవ్ చేయించుకుంటుంటే కంటెస్టెంట్‌లంతా ఆయనేదో బోర్డర్‌లో ప్రత్యర్థులతో సింగిల్‌గా ఫైట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. ఇక దివి అయితే బీభత్సంగా ఏడ్చేసింది.
ఇక.. హాఫ్ షేవ్ పూర్తయిన తరువాత అమ్మ రాజశేఖర్ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. వాష్ రూమ్‌లోకెళ్లి ఏడ్చేసి అది చాలదన్నట్టు కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చారు. చూడటానికి అదంతా యాక్టింగ్ లాగే అనిపించింది. ఇక దివి వచ్చి ‘మీరు చెయ్యనని చెప్పలేరా అమ్మా?’ అంటూ శోకాలు తీసింది. ఆయనే తాను చేస్తానని మొత్తుకుంటే ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్టు దివి బిల్డప్. బురదలో బటన్స్ ఏరే టాస్క్‌లో దివికి ఏడిస్తే క్లోజప్ షాట్స్ పడతాయి కాబట్టి ఏడవాలని మాస్టర్ దివికి చెప్పడం అన్‌సీన్‌లో చూపించారు. అలాంటి మాస్టర్ ఏడిస్తే అది నమ్మశక్యమేనా? ఇక నాగ్.. ఆయనను ఓ త్యాగమూర్తిగా ప్రశంసించడం.. అమ్మ కోసం కూడా చేయించుకోలేదంటూ.. ఇప్పుడు హౌస్ కోసం చేయించుకున్నావంటూ అభినందించడం.. బోర్డర్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించిన సైనికుడికి కూడా ఈ రేంజ్ ప్రశంసలు దక్కవేమో. శనివారం రాత్రి షోపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout