ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్లో అమ్మ నాన్న ఫిలింస్ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
రాహుల్ రవీంద్రన్, కార్తీక్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో...అమ్మ నాన్న ఫిలింస్ బ్యానర్‌పై రాథోడ్ దర్శకత్వంలో యువ నిర్మాత మణీంద్రన్. ఎమ్ రూపొందించనున్న చిత్రం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాథోడ్ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి. రాహుల్ రవీంద్రన్, కార్తీక్ ఆనంద్ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్లు, ఇంకా ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది...ఏప్రియల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది..అని అన్నారు.
చిత్ర నిర్మాత మణీంద్రన్. ఎమ్ మాట్లాడుతూ...కథ చాలా బాగా వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించనున్నాము. ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలవుతుంది. మంచి చిత్రంగా మా అమ్మ నాన్న ఫిలింస్ బ్యానర్లో ఈ మూవీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, సహనిర్మాత: ప్రశ్నాత్ తాత, నిర్మాత: మణీంద్రన్. ఎమ్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాథోడ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments