'అమ్మ' సినిమా ఆగిపోయింది..
- IndiaGlitz, [Friday,February 17 2017]
కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధానంగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు సినిమా పూర్తి కావచ్చింది కూడా. 'అమ్మ' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆగిపోయింది.
అయితే కారణాలు మాత్రం తెలియడం లేదు. నేను నా పార్ట్‌ను పూర్తి చేశాను. ఇక సినిమాను కంటిన్యూ చేయాలా..వద్దా అనేది దర్శక నిర్మాతలకు సంబంధించిందే అంటూ రాగిణి ద్వివేది తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ సినిమా విడుదలైతే తనకు మంచి బ్రేక్ వస్తుందనే రాగిణి ద్వివేది ఆశలపై నీళ్ళు చల్లినట్టయ్యింది.