అమితాబ్‌కు కరోనా అని తేలడంతో చిరు, మహేష్, సచిన్ ట్వీట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే. తనకు పాజిటివ్ అని.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని.. తనను గత పది రోజులుగా కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ఎందరో ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.
అమితాబ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని చిరు ట్వీట్ చేశారు. బిగ్‌బి త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్ చేశారు. తన ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ మాదిరిగానే క్రికెటర్లు షోయబ్ అక్తర్, యువరాజ్ సింగ్‌లు కూడా అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు.. అనుపమ్ ఖేర్ కూడా అమితాబ్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కరోనా యుద్ధంలో బిగ్‌బి గెలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని తామంతా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
All our best wishes and hearty prayers are with you Amit ji! @SrBachchan Get well Soon! https://t.co/WsmqTw7y9t
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2020
Take care Amit ji.
— Sachin Tendulkar (@sachin_rt) July 11, 2020
Praying for your good health and quick recovery. ???? https://t.co/KRwPQ9RQZT
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments