అమితాబ్‌కు కరోనా అని తేలడంతో చిరు, మహేష్, సచిన్ ట్వీట్లు

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే. తనకు పాజిటివ్ అని.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని.. తనను గత పది రోజులుగా కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ఎందరో ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.

అమితాబ్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని చిరు ట్వీట్ చేశారు. బిగ్‌బి త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్ చేశారు. తన ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలని త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ మాదిరిగానే క్రికెట‌ర్లు షోయబ్ అక్తర్, యువరాజ్ సింగ్‌లు కూడా అమితాబ్ త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు.. అనుపమ్ ఖేర్ కూడా అమితాబ్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కరోనా యుద్ధంలో బిగ్‌బి గెలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని తామంతా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

More News

అభిషేక్‌, ఐశ్వర్య, జయాబచ్చన్‌ల కరోనా ఫలితమిదే...

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపింది.

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

విశ్వ‌క్ సేన్‌కు క్రేజీ ఆఫ‌ర్‌

‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా..