పవన్ గురించి అమితాబ్ ఏమన్నాడంటే...
- IndiaGlitz, [Saturday,September 28 2019]
అక్టోబర్ 2న 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి ప్రత్యేకంగా అమితాబ్‌ను కలుసుకున్నారు. అమితాబ్, చిరంజీవిని నిర్మాత పర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంలో తన తమ్ముడు పవన్‌కల్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడని చెప్పగానే అమితాబ్ అందుకుని పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉందని అన్నారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'సైరా నరసింహారెడ్డి' కోసం కుటుంబం అంతా ముందుకు వచ్చిందని అన్నారు.
చిరుతో పాటు అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, కిచ్చాసుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, అనుష్క .. తదితరులు భారీ స్టార్ క్యాస్టింగ్గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం చాలా రిచ్‌గా, విజువల్ ఫీస్ట్‌గా,ఎమోషనల్‌గా ఉంటుందట. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రధారిని బ్రిటీష్‌వారు ఉరి తీసే సన్నివేశం గూజ్బమ్స్ వస్తుందని అంటున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈసినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన జనసేనాని పవన్‌కల్యాణ్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడనే సంగతిని రామ్‌చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వాయిస్ ఓవర్ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే సినీ వర్గాల సమాచారం మేర క్లైమాక్స్‌లో నరసింహారెడ్డిని ఉరితీసి ఆయన తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి బ్రిటీష్‌వారు వేలాడదీసిన తర్వాత .. ఉయ్యాలవాడ పోరాటం ఇతరుల్లో ఎలా స్ఫూర్తి నింపిందనే సన్నివేశాలను 15 నిమిషాలు పాటు చిత్రీకరించారట. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందట.