ప‌వ‌న్ ట్వీట్‌కు అమితాబ్ రీ ట్వీట్‌... వైర‌ల్‌...

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

సినీ క‌థానాయ‌కుడి నుండి.. రాజకీయాల వైప అడుగులేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. చైత‌న్య‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ యాక్టివ్‌గా ఉంటుంటారు. ఎక్కువ‌గా జాతీయ వాదాన్ని వినిపిస్తూ ఉంటారు.

రీసెంట్‌గా ప‌వ‌న్ ఆర్మీ స‌మాజానికి ఎంత స‌హాయ‌కారిగా ఉంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఆర్మీ స‌త్తాని తెలియ‌జేస్తూ కొన్ని సందేశాల్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అంద‌రికీ న‌చ్చాయి. దీనిపై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించారు. ఆయ‌న ప‌వ‌న్ ట్వీట్‌కు 'జై హింద్‌' అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి అమితాబ్‌కు థాంక్స్ చెబుతూ.. ప‌వ‌న్ ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు.