'#మీ టూ' పై అమితాబ్ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ షూటింగ్ సమయంలో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది. అదే సమయంలో ఆమెకు చాలా మంది బాలీవుడ్ నటులు తమ మద్ధతుని తెలిపారు. ఆ సమయంలో అమితాబ్‌ను స్పందించమని అడిగితనే `నేను తనుశ్రీదత్తాను కాను.. నానా పటేకర్‌నికాను` అంటూ వ్యాఖ్యలు చేశాడు. దానిపై తను శ్రీ బాధను కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ టూ ఉద్యమం గురించి అమితాబ్ పెదవి విప్పారు. `పనిచేసే ప్రదేశంలో ఎవరైనా మహిళల పట్ల దురుసుగా అమర్యాదగా ప్రవర్తించకూడదు.. ఒకవేళ అలా ప్రవర్తిస్తే సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియచేయాలి. సమాజంలో మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలు అణిచివేతకు గురువుతున్న క్రమంలో పాఠశాల స్ధాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది` అంటూ అమితాబ్ స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments