70 కోట్ల ట్యాక్స్ కట్టిన బిగ్ బి
- IndiaGlitz, [Saturday,April 13 2019]
సీనియర్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ .. గత ఏడాది ముజఫర్ నగర్‌లో 2084 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలను చెల్లించారు. పుల్వామా దాడిలో చినపోయిన అమర జవానుల కుటుంబాలకు పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బద్లా సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బిగ్ బ్రహ్మాస్త, సైరా నరసింహా రెడ్డి, ఉయర్నంద మనిదన్ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఒక పక్క కమర్షియల్ యాడ్స్, మరో పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.
సంపాదనలోనే కాదు.. ట్యాక్స్ చెల్లింపుల్లోనూ ఆయన తన బాధ్యతను నిర్వర్తించారు. 2018-19 ఏడాదికి 70 కోట్ల రూపాయలను చెల్లించినట్లు బిగ్ బి అధికార ప్రతినిధి తెలియజేశారు.