సైరాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందంటే...

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రాహ‌ణం అందిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ కొత్త షెడ్యూల్‌లో అమితాబ్ పాత్ర చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. నాకు ప్రియ‌మైన మిత్రుడు, తెలుగు చిత్ర సీమ‌లో ప్ర‌ముఖ హీరో అయిన చిరంజీవి అడగడంతో సైరాలో స్పెష‌ల్ రోల్ చేయ‌డానికి ఒప్పుకున్నాను. హైద‌రాబాద్‌లో నా లుక్‌కు సంబంధించిన షూట్ జ‌ర‌గనుంది. నా లుక్ దాదాపు ఇలాగే ఉండొచ్చు అంటూ అమితాబ్ ఓ పోటోను సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడ‌ది వైర‌ల్ అవుతుంది. 

More News

డైరెక్ష‌న్ ఆలోచ‌నలో యంగ్ హీరో....

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీవిష్ణు.

వెబ్ సిరీస్‌లో అమీర్ ఖాన్‌...

ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఓషో 1990లో క‌న్నుమూశారు.

సీనియ‌ర్ న‌టి జ‌యంతికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ద‌క్షిణాది  తెర‌పై త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన న‌టీమ‌ణి జ‌యంతి.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. ప్ర‌స్తుతం వ‌య‌సు మీద‌ప‌డ‌టంతో జ‌యంతి బెంగుళూరులో ఉంటున్నారు.

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో అభిషేక్ ఫిలిమ్స్ చిత్రం

త‌మిళ `చ‌తురంగ వేట్టై` ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశ‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా

ఏప్రిల్ 6న గులేబకావళి

నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇండియన్ మైఖేల్‌జాక్సాన్‌గా పిలుచుకునే ప్రభుదేవాకు తెలుగునాట వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గులేబకావళి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం.