నాగ్,వర్మ చిత్రంలో అమితాబ్?
Send us your feedback to audioarticles@vaarta.com
24 ఏళ్ల తరువాత కింగ్ నాగార్జున, సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాంబినేషన్లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. నవంబర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని ఏప్రిల్ 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
కాగా, ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కొద్దిసేపే ఉన్నా.. సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారమ్. ఇంతకుముందు ఈ సినిమాలో టాబు హీరోయిన్గా నటించనుందని ఆ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే.. వర్మ వాటిని ఖండించారు. మరి అమితాబ్ విషయమైనా వర్కవుట్ అవుతుందో లేకపోతే గాసిప్స్కే పరిమితమవుతుందో చూడాలి. హిందీ చిత్రం ఖుదాగవాలో అమితాబ్, నాగ్ కలిసి నటించారు. అలాగే నాగ్ నటించిన మనం చిత్రంలోనూ అతిథి పాత్రలో తళుక్కున మెరిసారు అమితాబ్. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే అది ఆసక్తికరమే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com