నాగ్‌,వ‌ర్మ చిత్రంలో అమితాబ్?

  • IndiaGlitz, [Monday,November 13 2017]

24 ఏళ్ల త‌రువాత కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో నాగార్జున ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.

కాగా, ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కొద్దిసేపే ఉన్నా.. సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. ఇంత‌కుముందు ఈ సినిమాలో టాబు హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

అయితే.. వ‌ర్మ వాటిని ఖండించారు. మ‌రి అమితాబ్ విష‌య‌మైనా వ‌ర్క‌వుట్ అవుతుందో లేక‌పోతే గాసిప్స్‌కే ప‌రిమిత‌మ‌వుతుందో చూడాలి. హిందీ చిత్రం ఖుదాగ‌వాలో అమితాబ్‌, నాగ్ క‌లిసి న‌టించారు. అలాగే నాగ్ న‌టించిన మ‌నం చిత్రంలోనూ అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసారు అమితాబ్‌. మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అది ఆస‌క్తిక‌ర‌మే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

More News

అప్పుడు లెక్చ‌ర‌ర్‌.. ఇప్పుడు ప్రొఫెస‌ర్‌

25 ఏళ్ల క్రితం కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సుంద‌ర‌కాండ‌లో లెక్చ‌ర‌ర్‌గా విక్ట‌రీ వెంక‌టేష్ చేసిన సంద‌డి అంత సులువుగా మ‌ర‌చిపోలేం. ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ చిత్రంతో వెంక‌టేష్ కి న‌టుడిగా మరింత గుర్తింపు వ‌చ్చింది.

ఫైన‌లైజ్ చేయ‌లేద‌న్న అనిల్‌

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మయ్యాడు అనిల్ రావిపూడి. ఆ త‌రువాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల స‌క్సెస్‌తో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు.

చార్జ్... అంటూ వస్తున్న 'కార్తీ'

'ఖాకి' సినిమా ఎలా ఉండబోతోందా? అనే సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తిని 'ఖాకి' ట్రైలర్ ఉత్కంఠగా మారుస్తోంది. ప్రతి షాట్ నూ ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూసేలా తెరకెక్కించిన విషయం ట్రైలర్ను చూస్తేనే అర్థమవుతోంది.

ఎప్పటికైనా దర్శకుడినవుతా - ధర్మేంద్ర కాకరాల

జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై యాంగ్రీ యంగ్ మేన్గా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `పిఎస్ వి గరుడవేగ 126.18ఎం`.

క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ర‌కుల్‌

తెలుగులో అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇక్క‌డ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసింది.