వరద బాధితులకు అమితాబ్ సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని రోజులుగా బిహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 15 జిల్లాల్లోని 1400 గ్రామాలు జలమయమైయాయి. 73 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 లక్షల మంది నిరాశ్రయలయ్యారు. ప్రజల కష్టాలను చూసిన బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్ బి వెంటనే స్పందించారు. సీఎం నితీశ్ కుమార్‌కి లేఖ రాశారు. బిహార్‌లోని ప్రజలు వర్షాలతో పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధగాఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కి 51 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అమితాబ్ స్పందించడం ఇదేం కొత్తేం కాదు. గత ఏడాది ఉత్తరప్రదేశ్ రైతుల కోసం ఆర్థిక సాయం చేశారు. కొంత మంది రైతుల బ్యాంకులోన్స్ను అమితాబ్ చెల్లించి అందరి మనసులు చూరగొన్నారు. తాజాగా ఇప్పుడు అమితాబ్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. అమితాబ్ బచ్చన్ రీసెంట్గా నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. ఇందులో ఆయన ఉయ్యాలవాడ గురువు గోసాయి ఎంకన్న పాత్రలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout