కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

భారత్‌ను కొవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే కొవిడ్ బారిన పడిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ఢిల్లీలోని రాక‌బ్ గంజ్‌లో ఉన్న గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి రెండు కోట్ల రూపాయ‌లు విరాళాన్ని ప్ర‌క‌టించారు.

Also Read: కొవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ నిర్మాతల సాయం

విరాళాన్ని ప్రకటించేసి చేతులు దులిపేసుకోలేదు. గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌ను స‌రైన స‌మ‌యంలో రప్పించేలా సైతం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని సద‌రు సంర‌క్ష‌ణా కేంద్రం ప్ర‌తినిధి ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు. ‘‘సిక్కులు లెజెండరీ పీపుల్. ఇవి గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి రూ.2 కోట్లు డొనేట్ చేసిన సయంలో అమితాబ్ గారు అన్న మాటలివి. ఆక్సిజన్ లేమి కారణంగా ఢిల్లీ బాధపడుతున్నందున అమితాబ్ గారు నాకు కాల్ చేసి ఆక్సీజన్ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు’’ అని గురు తేజ్ బ‌హుదూర్ కరోనా సంర‌క్ష‌ణా కేంద్రం ప్రతినిధి ట్వీట్‌లో తెలిపారు.