అమితాబ్ - నాగ్ అతిధులుగా వంగవీటి..!
Friday, December 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇటీవల విజయవాడలో వంగవీటి ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఈ ఆడియోకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది.
ఈ నెల 23న వంగవీటి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే...వంగవీటి మూవీ రిలీజ్ కి మూడు రోజుల ముందుగా అనగా ఈనెల 20న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెషన్ సెంటర్ లో శివ టు వంగవీటి ఎ జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనే స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ఒక తెలుగు సినిమా ఫంక్షన్ కి అమితాబ్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments