మహేష్ మల్టీప్లెక్స్‌లో అమితాబ్-ఆమిర్ సినిమా!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యింది.
ఈ మల్టీప్లెక్స్‌కి 'వి.జె' అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న దీనిని ఓపెన్ చేయనున్నారు. హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోలుగా నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాతో మహేష్ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది.
భాగ్య నగరంలోని మహేష్ అభిమానులు తమ హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? తమ హీరో థియేటర్లో ఎప్పుడు ఆ సినిమాను చూద్దామా? అని ఎదురు చూస్తున్నారు.
దీపావళికి మహేష్ సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో వారు కొంచెం నిరాశ పడుతున్నారు. మహేష్ సినిమా విడుదల అయితే... మహేష్ మల్టీప్లెక్స్‌లో ఆ సినిమా చూస్తే... ఎంతో సంతోషంగా ఉండేదని అభిమానులు అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com