Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

  • IndiaGlitz, [Monday,May 27 2024]

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తుంటే.. ఎన్డీయే కూటమిదే అధికారమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే ఏకంగా సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది.

ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అమిత్ షా తన అంచనాలను వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈసారి ఒడిశాలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని అలాగే ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీచేసింది. అయితే 25 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు రావచ్చని షా అంచనా వేశారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాల్లో బీజేపీ 24 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ సైతం జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమికి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని యోగేంద్ర వ్యాఖ్యానించగా.. తాజాగా అమిత్ షా సైతం 17 చోట్ల గెలుస్తామని చెప్పడంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. మరి అమిత్ షా అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయనేదీ జూన్ 4వ తేదీన తేలనుంది.

More News

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టింది. ఆయన సారథ్యంలోనే పార్లమెంట్

JD Lakshminarayana: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలి.. జేడీ డిమాండ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం ఈ ఏడాది జూన్ రెండో తేదీతో ముగుస్తుంది.

Postal Ballot: ఏపీలో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఏ పార్టీకి లాభమో..?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పదిరోజులు దాటిపోయింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది.

MLC Elections: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం.. గెలుపుపై పార్టీల ధీమా..

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా కూడా తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావిడి ఇంకా తగ్గలేదు. మే 27(సోమవారం) జరగనున్న ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది.

ప్రభాస్ 'బుజ్జి' కారును నడిపిన చైతన్య.. 'కల్కి' టీమ్‌కి హ్యాట్సాఫ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు