దేశంలోని సంపన్నులకు షా విన్నపం.. ప్రజలకు భరోసా!
Send us your feedback to audioarticles@vaarta.com
మే-03వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఏప్రిల్-20 తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఉంటాయని.. కరోనా కేసులు ఎక్కవైతే మాత్రం మరింత కఠినంగా అమలు చేస్తామని కూడా మోదీ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో దేశ ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా.. దేశ ప్రజలకు అభయమిస్తూ ఓ విన్నపం చేశారు. దేశ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా భరోసా ఇచ్చారు. దేశంలో అందరికీ సరిపడా ఆహార నిల్వలు, ఔషధాలు ఉన్నాయని.. ఈ విషయంలో హోంమంత్రిగా తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ పొడిగింపుతో భయపడాల్సిన అవసరం లేదు. విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు విధులను నిర్వహిస్తున్నారు. వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారు’ అని షా చెప్పుకొచ్చారు.
విన్నపం ఇదీ..
అదేవిధంగా దేశంలోని సంపన్నులు సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా వారికి షా ఓ విన్నపం చేశారు. అందరూ ముందుకొచ్చి మీవంతు సేవ చేయాలని కోరారు. ప్రభుత్వం సమయానుకూలంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రజలు నిబద్ధతతో పాటించడం వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. మే 3 వరకూ లాక్డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల రక్షణ కోసమే అని ఈ సందర్భంగా షా మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి రాష్ట్రాలు కలిసి నడిచిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందేనన్నారు. అంతేకాదు.. ఇకపై మరింత బలంగా అడుగులు పడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రజలు కూడా లాక్డౌన్ను మరింత చక్కగా పాటిస్తూ.. ఇళ్లలోనే ఉండాలని షా కోరారు. ప్రజలకు కావాల్సినవి అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వాలు చేయాలని అమిత్ షా ట్విట్టర్ వేదికగా సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout