గ్రేటర్ ఎన్నికల కోసం రంగంలోకి అమిత్ షా.. మ్యాజిక్ జరిగితే..

  • IndiaGlitz, [Wednesday,November 25 2020]

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజీపీ ఆషామాషీగా తీసుకోవడం లేదు. గెలుపోటములను పక్కనబెడితే అధికార టీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనేదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్ర నేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరుల హైదరాబాద్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలోనే నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్‌కు వచ్చి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే.. ఈ నెల 27న హైదరాబాద్‌కు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ రానున్నారు. కాగా.. యోగి పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 28న హైదరాబాద్‌కు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, 29న అమిత్ షా రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప అధికార పార్టీ మినహా వేరొక పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం కానున్నాయి. 150 డివిజన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

150 డివిజన్లలో గెలుపొందిన వారిలో నుంచే ఒకరు మేయర్‌ అవుతారు. అంటే.. మేజిక్‌ ఫిగర్‌ను 76గా భావించవచ్చు. పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌కు 35 మంది, మజ్లిస్‌కు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒకరు మాత్రమే ఉన్నారు. 49 మంది ఎక్స్‌-అఫిషియోలను కలుపుకొంటే మేయర్‌ ఎన్నికకు మేజిక్‌ ఫిగర్‌ 100 అవుతుంది. కాగా.. కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే నమోదైతే మేజిక్‌ ఫిగర్‌ 102గా మారుతుంది. ఈ విధంగా చూస్తే టీఆర్ఎస్‌కు తప్ప మరో పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఏదైనా మ్యాజిక్ జరిగితే మేయర్ పీఠం.. కాకుంటే భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ చాలా సీరియస్‌గా జీహెచ్ఎంసీపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.

More News

మోహ‌న్‌బాబు చిత్రంలో ర‌కుల్‌..?

విలక్ష‌ణ న‌టుడిగా, నిర్మాత‌గా సినీ రంగంలో త‌న‌దైన ముద్ర‌వేసిన క‌లెక్ష‌న్ కింగ్ డా.మోహ‌న్‌బాబు, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నాలుగున్న‌ర ద‌శాబ్దాలు పూర్త‌య్యాయి.

తమిళనాడు, ఏపీ వైపు దూసుకొస్తున్న నివర్ తుపాను

నివర్.. అతి తీవ్ర తుపానుగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర తుపాను కదిలింది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్.. షాకవుతున్న నెటిజన్లు..

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. కొంతకాలంపాటు జనాలు కంప్లీట్‌గా ఇళ్లకే పరిమితమయ్యారు.

‘ఆర్ఆర్ఆర్’కు మెగాస్టార్ సాయం..

‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ సినిమాకు మెగాస్టార్ సాయమందించనున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇక లేరు..

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(71) కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.